Raja Saab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ”ది రాజా సాబ్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ హారర్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ గురించి డైరెక్టర్ మారుతీ త్వరలోనే అప్డేట్ ఇవ్వబోతున్నారు అని ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్ తెలిపారు. ఈ క్రమంలో ”రాజా సాబ్” సినిమా టీజర్ ఏప్రిల్ నెల ఆఖరిలో రాబోతుంది సమాచారం. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.