HomeతెలంగాణRajaiah:రాజయ్య దారెటు?

Rajaiah:రాజయ్య దారెటు?

రాజయ్య దారెటు?

కడియం శ్రీహరికి బీఆర్​ఎస్​ టికెట్​ కన్ఫర్మ్​?

ఇదే నిజం, స్టేషన్ ఘనపూర్‌ : స్టేషన్ ఘనపూర్‌లో రాజకీయం వేడెక్కింది. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్ఎస్ అసెంబ్లీ టికెట్ దూరమయినట్లుగా సమాచారం.ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ఖాయమయినట్లుగా తెలుస్తోంది.ఈ సమాచారంతో గురువారం ఎమ్మెల్యే రాజయ్య అనుచరులు పెద్ద ఎత్తున మంత్రి హరీశ్ రావును కలిసి తమ నేత రాజయ్యకు టికెట్ ఇవ్వాల్సిందిగా కోరినట్లుగా సమాచారం. అయితే టికెట్ విషయంలో హరీశ్ నుంచి వారికి స్పష్టమైన హామీ దక్కనట్లుగా తెలుస్తోంది. దీంతో సిట్టింగు శాసనసభ్యుడు రాజయ్య దారెటు? అనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఒకవేళ స్టేషన్ ఘనపూర్​లో టికెట్ రాకపోతే రాజయ్యను వరంగల్ ఎంపిగా బరిలో ఉంచుతారనే ప్రచారం కూడా ఉన్నది. అదేవిధంగా రాజయ్య అడుగులు కాంగ్రెస్ వైపు ఉంటాయా? లేక బిఎస్ పి వైపు ఉంటాయా? అనే చర్చ ఊపందుకున్నది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి నేడు భద్రకాళి గుడిలో రాజయ్య రాజశ్యామల యాగం చేస్తున్నారు. యాగం అనంతరం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం నడుస్తోంది

Recent

- Advertisment -spot_img