ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్’ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లను రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. సంబంధిత వీడియా బుధవారం విడుదలైంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. పలు ఇంట్రెస్టింగ్ విషయాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ షేర్ చేసుకున్నారు. నేను ఇప్పటివరకు 4 సినిమాలు తీశాను.. కానీ ఏ సినిమా రిలీజ్‌కి ఇంత టెన్షన్ పడలేదు.. దానికి కారణం ఏంటంటే.. సలార్‌లో డ్రామా ఎక్కువ ఉంది.. నేను ఇంత డ్రామా ఎప్పుడూ ట్రై చేయలేదు.. అదే కాస్త టెన్షన్.. రాజమౌళి గారి సినిమాల్లో డ్రామా బాగా వర్కవుట్ అవుతుంది.. నాకు ఎలా అవుతుందో చూడాలి’ అంటూ ప్రశాంత్ చెప్పాడు. ఇండియాతో పాటు వరల్డ్ వైడ్‌గా ప్రస్తుతం ‘సలార్’ఫీవర్ నడుస్తోంది. యూఎస్ మార్కెట్లో నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్‌ను సలార్ చూపిస్తోంది. మరి ఎప్పుడు నుంచో భారీ బుకింగ్స్‌ను ప్రీ సేల్స్ లో రాబడుతున్న ఈ చిత్రం ఇప్పుడు మరో రికార్డు మైల్ స్టోన్ జస్ట్ ప్రీ సేల్స్ లోనే కొట్టేసింది. ఇప్పుడు ఏకంగా 1.5 మిలియన్ డాలర్స్ గ్రాస్‌ను రాబట్టి అదరగొట్టింది. దీంతో అక్కడ బుకింగ్స్ మాత్రం ఇప్పుడు బీస్ట్ మోడ్‌లో ఉన్నాయని చెప్పాలి. ఇక రిలీజ్ డేట్‌కు 2 మిలియన్‌ను క్రాస్ చేసిన ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు. ఇక ఈ అవైటెడ్ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించగా హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది.