Homeహైదరాబాద్latest Newsక్షతగాత్రుడిని తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించిన కేస గాని రాజశేఖర్ గౌడ్

క్షతగాత్రుడిని తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించిన కేస గాని రాజశేఖర్ గౌడ్

ఇదే నిజం, ఖమ్మం: రోడ్డు ప్రమాద బాధితుడికి నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కేస గాని రాజశేఖర్ గౌడ్ ఆపద్బాంధవుడిగా నిలిచారు. తన సొంత వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లి.. సకాలంలో అత్యవసర వైద్యం అందే లాగా చేశారు. ప్రస్తుతం ఆ బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్ ఇందిరమ్మ కాలనీకి చెందిన విజయ్(35) వ్యక్తిగత పనిమీద ఖమ్మం నగరానికి వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో అతడు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని మరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. రక్త స్రావం కూడా తీవ్రంగా అయింది. ఆచేతనంగా రోడ్డు మీద పడి ఉన్న అతడిని.. డాక్టర్ రాజశేఖర్ గౌడ్ చూసి చలించి పోయారు. అదే మార్గం మీదుగా తన వాహనంలో వస్తున్న డాక్టర్ రాజశేఖర్ గౌడ్ మరో మాట ఆలోచించకుండా విజయ్ ని తన వాహనంలో ఎక్కించుకున్నారు. అక్కడికక్కడ ప్రధమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి అత్యవసర వైద్య విభాగంలో విజయ్ చికిత్స పొందుతున్నారు. విజయ్ తండ్రి వెంకటేశ్వర్లు భవన నిర్మాణ మేస్త్రి గా పని చేస్తున్నారు. సకాలంలో స్పందించి విజయ్ ప్రాణాన్ని కాపాడిన డాక్టర్ రాజశేఖర్ గౌడ్ ను పలువురు నగరవాసులు అభినందించారు.

Recent

- Advertisment -spot_img