HomeసినిమాRajinikanth : Hukum @100 million views Rajini Kanth : హుకుం @100...

Rajinikanth : Hukum @100 million views Rajini Kanth : హుకుం @100 మిలియన్​ Views

సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్​ కుమార్ కాంబోలో వచ్చిన యాక్షన్ ఎంటర్​టైనర్​ జైలర్. ఆగస్టులో రిలీజైన ఈ సినిమా రజనీ ఫ్యాన్స్​ను విపరీతంగా ఆకట్టుకుంది. తమిళనాట బాక్సాఫీసు రికార్డులను కొల్లగొట్టి మరోసారి రజనీ మేనియాను చూపించింది. వరల్డ్​ వైడ్​గా హిట్ టాక్​ తెచ్చుకుని కలెక్షన్లలో దుమ్మురేపిన ఈ సినిమాకు సంగీత సంచలనం అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలోని అన్ని సాంగ్స్​ ఆడియెన్స్​ను అలరించాయి. అయితే, జైలర్ మూవీలోని‘హుకుం’ సాంగ్ లిరికల్ వీడియో తాజాగా యూట్యూబ్​లో సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు 100 మిలియన్స్​కు పైగా వ్యూస్​ను రాబట్టింది. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రమ్య కృష్ణ, యోగి బాబు, శివ రాజ్ కుమార్, సునీల్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

Recent

- Advertisment -spot_img