Homeహైదరాబాద్latest NewsRajini Kanth : తలైవా మేనియా.. ట్రెండింగ్​లో ‘లాల్ సలాం’

Rajini Kanth : తలైవా మేనియా.. ట్రెండింగ్​లో ‘లాల్ సలాం’

జైలర్​ సినిమాతో కమ్​బ్యాక్​ హిట్ కొట్టి ఇండియన్ బాక్సాఫీసుకు తన సత్తాను మరోసారి చూపించాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆ సినిమాలో ఆయన మేనరిజనానికి ఫ్యాన్స్ మరోసారి ఫిదా అయ్యారు. వరల్​వైడ్​గా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. జైలర్​ మూవీ ఇచ్చిన ఊపుతో రజనీకాంత్ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన ‘లాల్ సలాం’ సినిమాకు సంబంధించిన ట్రైలర్​ను మేకర్స్ దీపావళి సందర్భంగా ఆదివారం రిలీజ్ చేశారు. టీజర్​లో యాక్షన్ ఎలమెంట్స్ ఆడియెన్స్​ను ఆకట్టుకున్నాయి. 24 గంటల్లో యూట్యూబ్​లో 3 మిలియన్లకు వ్యూస్​ తెచ్చుకున్న ఈ టీజర్ మరోసారి తలైవా మేనియాను చూపించింది. ప్రస్తతం యూట్యూబ్​లో ఈ టీజర్ ట్రెండింగ్​లో ఉంది. విష్ణు విశాల్, విక్రాంత్, సెంథిల్, జీవిత, తంబి రామయ్య, అనంతిక, వివేక్ ప్రసన్న కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాపై రజనీ ఫ్యాన్స్​తో పాటు ఆడియెన్స్​లోనూ భారీ అంచనాలున్నాయి. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ లాల్​ సలామ్​ను రిలీజ్ చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img