తెలుగులో చాలా వేగంగా స్టార్ డమ్ ను అందుకున్న కథానాయికల జాబితాలో రకుల్ పేరు ముందు వరుసలో కనిస్తుంది.
చిన్న సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన రకుల్, స్టార్ హీరోల జోడీగా మెరవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు.


ఒకానొక దశలో ఆమె స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లింది.
ఆ సమయంలోనే ఆమెకి కోలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చాయి. అయితే రకుల్ మాత్రం బాలీవుడ్ సినిమాలపై ఎక్కువగా దృష్టిపెట్టింది.


బాలీవుడ్ చుట్టూ రకుల్ ప్రదక్షిణ చేస్తుంటే, ఇక్కడ ఆమెకి గల ప్లేస్ చేజారిపోయింది.
ఒక్కసారిగా తెలుగులో రకుల్ కి సినిమాలు తగ్గిపోయాయి.


ఇక తమిళంలో ఆమె పెద్దగా దృష్టి పెట్టలేదు గనుక, ఆ విషయాన్ని గురించి మాట్లాడుకోవలసిన అవసరం లేదు.
అయితే బాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోతే రకుల్ పని అయిపోయినట్టేనని అంతా అనుకున్నారు.


కానీ బాగానే బాలీవుడ్ లో ఓ మూడు సినిమాలు చేస్తోంది. అంతేకాదు అక్షయ్ కుమార్ జోడీగా చేసే ఛాన్స్ కొట్టేసింది.
రంజిత్ తివారి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. శ్రద్ధా కపూర్ .. కియారా అద్వానీని దాటుకుని ఈ ఛాన్స్ రకుల్ కి రావడం విశేషం.