దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘గేమ్ చేంజర్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమా ఇంటర్వెల్ సీన్లో రామ్ చరణ్ పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తాడని.. అది ఫ్లాష్ బ్యాక్ కి లీడ్ అని తెలుస్తోంది. సునీల్ పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఈ ట్విస్ట్, గొప్ప థ్రిల్లింగ్ ఎలిమెంట్‌గా నిలుస్తోందని సమాచారం. పైగా ఈ ట్విస్ట్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని.. చరణ్ ఓల్డ్ పాత్రలోని సరికొత్త వేరియేషన్స్ ను చూపిస్తుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఇంటర్వెల్ సీక్వెల్లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా హైలైట్‌గా ఉంటుందట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో చరణ్ పాత్ర వెరీ పవర్‌ఫుల్‌గా ఉండనుంది. నిజానికి సహజంగానే తన సినిమాల్లో హీరోల్ని డిఫరెంట్ గెటప్స్ అండ్ మేకప్స్తో చూపించే ఆనవాయితీ ఉన్న శంకర్, ఈ సినిమాలో చరణ్‌ను కూడా డిఫరెంట్‌గా చూపించనున్నాడు. ఈ పొలిటికల్ డ్రామాలో శంకర్ ప్రెజెంటేషన్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీకి ఎస్. ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, దిల్ రాజు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Ram Charan : గేమ్ చేంజర్‌లో అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ ట్విస్ట్..!
RELATED ARTICLES