HomeSocial Mediaరామ్ చరణ్ "గేమ్ ఛేంజర్" మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ఫిక్స్…!

రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ఫిక్స్…!

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా “గేమ్ చేంజర్”. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌కి సంబంధించి కొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ మే 1 నుంచి చెన్నైలో జరగనుంది. నిన్నటితో హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిందని తెలుస్తోంది. శంషాబాద్‌లో రామ్ చరణ్, సునీల్, నవీన్ చంద్ర కాంబోలో పలు సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో నెక్స్ట్ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. ఈ షెడ్యూల్ చాలా కీలకమని, ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ సీనియర్ పాత్రపై ఈ షెడ్యూల్ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాపై మెగా అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే శంకర్ ఈ సినిమాలో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ పెడుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img