Homeహైదరాబాద్latest Newsచార్టెడ్ అకౌంట్ లో ఉత్తీర్ణత సాధించిన రామాజీపేట విద్యార్థినీ

చార్టెడ్ అకౌంట్ లో ఉత్తీర్ణత సాధించిన రామాజీపేట విద్యార్థినీ

ఇదేనిజం, రాయికల్: రాయికల్ మండలంలోని రామాజీపేట గ్రామానికి చెందిన అంబల్ల రాజరెడ్డి- సులోచన దంపతుల కుమార్తె అంబల్ల అర్చన చార్టెడ్ అకౌంట్( సి ఏ) లో ఉత్తమ శ్రేణి లో ఉత్తీర్ణత సాధించి ప్రతిభ కనబరిచింది. అర్చన చిన్నప్పటినుండే చదువులో చురుకుగా ఉంటూ విద్యలో రాణిస్తూ ఉన్నది. రాయికల్ కేరళ విద్యాలయంలో విద్యను ప్రారంభించి జగిత్యాల కరీంనగర్ పట్టణాలలో ఇంటర్మీడియట్ వరకు రాష్ట్రస్థాయిలో విద్యను అభ్యసించి ర్యాంకు సాధించింది. అలాగే డిగ్రీలో నిజాం కాలేజీలో క్యాంపస్ సీటు సాధించి డిగ్రీ పూర్తి చేసింది. 2016 ఉస్మానియా పీజీ ఎంట్రన్స్ టెస్ట్ లో రాష్ట్రస్థాయిలో 34వ ర్యాంక్ తో ఉస్మానియా క్యాంపస్ సీట్ సాధించి మాస్టర్ ఆఫ్ కామర్స్ లో ప్రథమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అనంతరం ఐ.సి.ఏ.ఐ. ఇండియా ఇన్స్టిట్యూట్ ద్వారా చార్టెడ్ అకౌంట్ పూర్తి చేసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. ఈ సందర్భంగా గ్రామ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అర్చన ను గ్రామస్తులు అభినందించారు.

Recent

- Advertisment -spot_img