స్టార్ రేటింగ్‌తో స్కైట్రాక్స్ విడుదల చేసిన అంతర్జాతీయ విమానాశ్రయాల ర్యాంకుల జాబితాలో ఖతర్ దేశ ఖ్యాతి మరోసారి రుజువైంది. ఆ దేశ రాజధాని దోహా లోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికి గాను ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్‌గా నిలిచింది. సింగపూర్‌కు చెందిన చాంగి రెండో స్థానంలో ఉంది. అమెరికాకు చెందిన ఏ ఒక్క విమానాశ్రయం టాప్ 20 లో లేకపోవడం గమనార్హం. ఈ జాబితాలో తొలి 100 ఎయిర్‌పోర్టుల్లో భారత్ నుంచి నాలుగు మాత్రమే ఉన్నాయి. దిల్లీ 36, బెంగళూరు 59, హైదరాబాద్ 61, ముంబయి 95 ర్యాంకులు సాధించాయి. దక్షిణాసియాలో.. ఉత్తమ ఎయిర్‌పోర్ట్‌గా దిల్లీ విమానాశ్రయం, సిబ్బంది సేవల్లో హైదరాబాద్, ఉత్తమ ప్రాంతీయ ఎయిర్‌పోర్ట్‌గా బెంగళూరు నిలిచింది.