Homeక్రైంస్టాఫ్ నర్సుపై డాక్టర్ అత్యాచారం

స్టాఫ్ నర్సుపై డాక్టర్ అత్యాచారం

భద్రాచలం: ప‌్రాణాలు క‌పాడాల్సిన డాక్ట‌ర్ కామంధుడిగా మారాడు. ఆస్ప‌త్రిలోని స్టాఫ్ న‌ర్సుపై క‌న్నేసి.. ఆమెని లైంగికంగా వేధించాడు. అంత‌టితో ఆగ‌కుండా నేరుగా ఆమె ఇంటికే పోయి రేప్ చేశాడు. ఆల‌స్యంగా వెలుగు చూసిన ఈ సంఘ‌ట‌న భ‌ద్రాచ‌లంలో జ‌రిగింది. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. సీఐ వినోద్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ప్ర‌భుత్వ ఏరియా ఆస్ప‌త్రిలో బాధితురాలు స్టాఫ్ న‌ర్సుగా విధులు నిర్వ‌హిస్తోంది. నెల క్రితం తాత్కాలికంగా వైద్య సేవ‌లు అందించేందుకు డాక్ట‌ర్‌ బాణోత్ రెడ్డి వ‌చ్చారు. స్టాఫ్ న‌ర్సుపై క‌న్నేసిన బాణోత్ ఆమెను లైంగికంగా వేధించ‌డం మొద‌లుపెట్టాడు. త‌న లైంగిక కోరిక‌లు తీర్చాలంటూ త‌ర‌చూ వేధిస్తుండేవాడు. ఈ క్ర‌మంలో ఆగ‌స్టు 24న ప‌ట్ట‌ణంలోని ఓ కాల‌నీలో నివ‌సిస్తున్న స్టాఫ్ న‌ర్సు ఇంటికి పోయి అక్క‌డ ఆమెను రేప్ చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడైన సదరు డాక్ట‌ర్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img