Homeఫ్లాష్ ఫ్లాష్Rare Snake : క‌ర్ణాట‌క‌లో అరుదైన అల్బినో పైథాన్

Rare Snake : క‌ర్ణాట‌క‌లో అరుదైన అల్బినో పైథాన్

Rare Snake : క‌ర్ణాట‌క‌లో అరుదైన అల్బినో పైథాన్

Rare Snake : కొండ‌ చిలువ చూస్తే ప్ర‌తి ఒక్క‌రికీ భ‌య‌మే .

అటువంటిది అరుదైన రంగుతో క‌న‌బ‌డితే ఇంకా భ‌యంతో కూడిన ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మాన‌దు.

ఇదే ఘ‌ట‌న కర్నాటకలో జ‌రిగింది. అరుదైన తెల్ల కొండ చిలువ ప్రత్యక్షమైంది.

కార్వాన్‌ జిల్లా మిర్జాన్‌లోని రాంనగర్‌లో నివాసమంటున్న సుబ్రహ్మణ్య నాయక్‌ అనే వ్యక్తి ఇంట్లో ఇది కనిపించింది.

సాధారణ కొండచిలువల కన్నా భిన్నంగా తెల్లని రంగులో ఉన్న కొండ చిలువను చూసి స్థానికులు అయోమయానికి గురయ్యారు.

సమాచారం అందుకున్న స్నేక్‌ క్యాచర్‌ పవన్‌ నాయక్‌కు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.. తెల్లని కొండ చిలువ అని నిర్ధారించారు.

మెలనిన్‌ లోపం కారణంగా పాము చర్మం తెల్లగా మారుతుందని.. దీన్ని ‘అల్బినో స్నేక్‌’గా పిలుస్తారని పవన్‌ నాయక్‌ పేర్కొన్నారు.

కొండచిలువను పట్టుకొని సురక్షిత ప్రాంతంలో వ‌దిలేశారు. గ‌తంలో కూడా శివమొగ్గ జిల్లాలో రెండుసార్లు శ్వేతనాగు ద‌ర్శ‌న‌మిచ్చింది.

Recent

- Advertisment -spot_img