HomeసినిమాRashmi Asking One Rupee : ఒక్క రూపాయి సాయం చేయడి ప్లీజ్

Rashmi Asking One Rupee : ఒక్క రూపాయి సాయం చేయడి ప్లీజ్

Rashmi Asking One Rupee : బుల్లితెర యాంక‌ర్‌గాను, వెండితెర‌పై క‌థానాయిక‌గాను అల‌రిస్తున్న అందాల ముద్దుగుమ్మ ర‌ష్మీ గౌత‌మ్.

ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

త‌న హాట్ హాట్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి కంటిపై కునుకు లేకుండా చేసే ర‌ష్మీ అప్పుడ‌ప్పుడు స‌మాజం ప‌ట్ల బాధ్య‌త‌గా ఉంటూ సోష‌ల్ స‌ర్వీస్‌పై ప‌లు అభ్య‌ర్ధ‌న‌లు చేస్తుంటుంది.

తాజాగా త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా ఒక్క రూపాయి అయిన సాయం చేయండ‌ని కోరింది.

నెల రోజుల క్రితం ఇషాన్ అనే కుక్క అనుకోకుండా ఆరో అంత‌స్తు నుండి కింద ప‌డింది.

దీనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇషాన్ చికిత్స‌కు రోజుకి 300-400 రూపాయల వరకు ఖర్చవుతుంది.

అది తిరిగి నడిచేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. అయితే ఆ కుక్క‌కి అప్ప‌టి వ‌ర‌కు చికిత్స అందించేందుకు నా వంతు సాయం చేస్తున్నాను.

అంద‌రం సాయం చేస్తే అది మ‌రింత పెద్ద‌ది అవుతుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను అనుసరిస్తున్న వారు 37,7800 మందికి పైగానే ఉన్నారు.

ఒక్కొక్కరు ఒక్క రూపాయి దానం చేసినా చాలు.

అది చాలా పెద్ద‌ది అయి కుక్క చికిత్స‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలియ‌జేస్తూ త‌న ఇన్‌స్టా ద్వారా డొనేట్ చేయాల్సిన లింక్‌ని కూడా షేర్ చేసింది.

మూగ జీవాల‌పై ర‌ష్మీ చూపిస్తున్న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు నెటిజ‌న్స్.

Recent

- Advertisment -spot_img