HomeసినిమాRashmika Mandanna : రష్మిక తల్లీదండ్రులు ఏం చేస్తారంటే

Rashmika Mandanna : రష్మిక తల్లీదండ్రులు ఏం చేస్తారంటే

Rashmika Mandanna : రష్మిక తల్లీదండ్రులు ఏం చేస్తారంటే

Rashmika Mandanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తెలుగులో నటించిన సినిమాలలో ఫ్లాపైన సినిమాల కంటే హిట్టైన సినిమాలే ఎక్కువగా ఉన్నాయనే సంగతి తెలిసిందే.

తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా వరుస ఆఫర్లతో రష్మిక మందన్నా బిజీగా ఉన్నారు.

నేషనల్ క్రష్ గా గుర్తింపును సంపాదించుకున్న రష్మిక సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను కూడా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉండటం గమనార్హం.

తాజాగా రష్మిక తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

ఇది మందన్నా ఫ్యామిలీ అని చెప్పడం సంతోషంగా ఉంది అని ఆమె కామెంట్లు చేశారు.

తన కుటుంబ సభ్యులు ఎప్పుడూ తన ఫేస్ పై చిరునవ్వును తీసుకొస్తారని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తుంటాం అని చెబుతూ రష్మిక మందన్నా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

స్టార్ హీరోయిన్ రష్మికకు తల్లీదండ్రులతో పాటు ఒక సిస్టర్ కూడా ఉంది.

రష్మిక చెల్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

రష్మిక షేర్ చేసిన ఫోటోకు 16 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో సులభంగానే అర్థమవుతుంది.

రష్మిక మందన్న ఫాదర్ పేరు మదన్ మందన్న అని ఈయన కాఫీ ఎస్టేట్ యజమాని అని తెలుస్తోంది.

మదన్ మందన్న విరాజ్ పేట అనే ప్రాంతంలో సొంతంగా కాఫీ ఎస్టేట్ ను కలిగి ఉన్నారని ఆయనకు విరాజ్ పేటలో సెరినిటీ అనే హాల్ కూడా ఉందని తెలుస్తోంది.

రష్మిక మందన్నా తల్లి పేరు సుమన్ మందన్నా కాగా ఈమె కూతురు కెరీర్ లో మరింత ఉన్నత స్థితికి ఎదిగేందుకు తన వంతు కృషి చేస్తుండటం గమనార్హం.

రష్మిక తర్వాత సినిమాలతో విజయాలను అందుకుంటారో లేదో చూడాలి.

Recent

- Advertisment -spot_img