గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4 కొత్త పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఆర్థికసాయం చేస్తామన్నారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందిస్తామని తెలియజేశారు. లక్షన్నర లోపు ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. మార్చి 31వ తేదీ నాటికి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.