మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల రిలీజైన ‘టైగర్ నాగేశ్వరరావు’సినిమా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. దీంతో తన తర్వాత సినిమాలపై ఆయన ఫోకస్ పెట్టారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ‘ఈగల్’సినిమాతో వచ్చి అలరించడానికి రెడీ అవుతున్నాడు. దీంతో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు వస్తున్న వార్తలపై మరోసారి క్లారిటీ వచ్చింది. అనుకున్న టైమ్ సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 13న సినిమాను వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని మరోసారి మేకర్స్ వెల్లడించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మిస్తున్న ఈ మూవీలో కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాపై ఆడియెన్స్‌లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.