Homeసినిమాసంక్రాంతి బరిలోనే Raviteja ‘ఈగల్’

సంక్రాంతి బరిలోనే Raviteja ‘ఈగల్’

మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల రిలీజైన ‘టైగర్​ నాగేశ్వరరావు’సినిమా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. దీంతో తన తర్వాత సినిమాలపై ఆయన ఫోకస్ పెట్టారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ‘ఈగల్’సినిమాతో వచ్చి అలరించడానికి రెడీ అవుతున్నాడు. దీంతో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు వస్తున్న వార్తలపై మరోసారి క్లారిటీ వచ్చింది. అనుకున్న టైమ్​ సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 13న సినిమాను వరల్డ్ వైడ్​గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని మరోసారి మేకర్స్ వెల్లడించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్​టైనర్​లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్​గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మిస్తున్న ఈ మూవీలో కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాపై ఆడియెన్స్​లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Recent

- Advertisment -spot_img