RC16 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ”RC16” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా స్టోరీ లీక్ అయింది. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా కథగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ ఊర మాస్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ అద్దె ఆటగాడిగా కనిపించబోతున్నాడని సమాచారం. అంటే క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బాడ్మింటన్ వంటి ఏదైనా ఆటకు డబ్బులు ఇస్తే అతను ఏ జట్టు కోసం ఆడతాడు. ఇలా అద్దె ఆటగాడిగా డబ్బులు కోసం అన్నీ గేమ్స్ ఆడుతున్న రామ్‌చరణ్ దేశం కోసం ఆడదానికి ఎలా మారతాడు అనే కథాశంతో బుచ్చిబాబు ఈ సినిమాని తీస్తున్నాడు అని సమాచారం. ఈ సినిమాలో రామ్‌చరణ్ యువకుడిగా, మధ్య వయసుకుడిగా, ఆలాగే పెద్దవాడిగా కనిపించబోతున్నాడు అని సినీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విరామం లేకుండా జరుగుతోంది. ఇటీవలే రామ్ చరణ్ క్రికెట్ ఆడే సన్నివేశాలను షూటింగ్ చేసారు. ఈ సినిమాని త్వరలోనే విడుదల చేయాలని బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడు.