Homeహైదరాబాద్latest Newsచరిత్ర సృష్టించిన ఆర్సీబీ… ఆర్సీబీ ఖాతాలో ఓ క్రేజీ రికార్డు..!

చరిత్ర సృష్టించిన ఆర్సీబీ… ఆర్సీబీ ఖాతాలో ఓ క్రేజీ రికార్డు..!

ఐపీఎల్ 2024లో ఆర్సీబీ అరుదైన ఘనతను సాధించింది. ఆర్సీబీ తమ అభిమానులు గర్వంగా చెప్పుకునే ఓ క్రేజీ రికార్డును నెలకొల్పంది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టు కూడా ఈ ఘనత సాధించలేకపోవడం గమనార్హం. అయితే నిన్న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు తొమ్మిది వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 200 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 49 బంతుల్లో 84* పరుగులతో అజేయంగా నిలిచాడు. షారుక్ ఖాన్ 30 బంతుల్లో58 పరుగులు సాధించారు. అనంతరం ఛేదనలో ఆర్సీబీ ఒక వికెట్ కోల్పోయి 16 ఓవర్లలో విజయం సాధించింది. విల్ జాక్స్ 41 బంతుల్లోనే అద్భుత అజేయ సెంచరీ సాధించాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన జాక్స్ 41 బంతుల్లో సెంచరీ సాధించడం విశేషం. అతనికి తోడుగా విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 70* పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అయితే ఛేజింగ్‌లో 24 బంతులు మిగిల్చిన ఆర్‌సీబీ అరుదైన రికార్డు సాధించింది. 200+ స్కోరును ఛేదించడంలో అత్యధిక బంతులు మిగిలి ఉండగానే గెలిచిన జట్టుగా బెంగళూరు చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు ముంబై ఇండియన్స్ (21 బంతుల్లో) పేరిట ఉండేది.

Recent

- Advertisment -spot_img