Homeహైదరాబాద్latest Newsముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ.. సద్వినియోగం చేసుకోవాలన్న దిటీ నర్సింలు

ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ.. సద్వినియోగం చేసుకోవాలన్న దిటీ నర్సింలు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జులై 11 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జనవరి నెలలో ప్రజా పాలన దరఖాస్తులు చేసుకోని వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించిందని మండల ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దిటీ నర్సింలు తెలిపారు. మహాలక్ష్మీ, గృహజ్యోతి, చేయూత, ఇందరమ్మ ఇండ్లు, రైతు భరోసా పథకాలకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అధికారులు ఆన్‌లైన్‌లో వెంటనే నమోదు చేయనున్నారు. ఉదయం, మధ్యాహ్నం వరకు ప్రతి రోజూ డేటా ఎంట్రీ చేస్తున్నారు. మహాలక్ష్మీ, గృహజ్యోతి, 500 కి గ్యాస్ సిలిండర్ , వంటివి రానివారు, అలాగే ఎవరైనా తప్పొప్పులు ఉంటే సరి చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు దిటీ నర్సింలు కోరారు. ఈ కార్యక్రమంలో ముద్దం రాజు, కనవేని ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img