Homeజాతీయంభారత్ సరికొత్త రికార్డ్ గత 24 గంటల్లో కోలుకున్నవారు లక్షమందికి పైనే

భారత్ సరికొత్త రికార్డ్ గత 24 గంటల్లో కోలుకున్నవారు లక్షమందికి పైనే

కనీవినీ ఎరుగని రీతిలో భారత్ లో ఒకే రోజు కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదైంది. గడిచిన 24 గంటల్లో లక్షమందికి పైగా ( 1,01,468) కోవిడ్ నుంచి కొత్తగా కోలుకున్నారు. వరుసగా నాలుగు రోజులుగా కొనసాగుతున్న ధోరణికి అనుగుణంగానే ఈ విధమైన పెరుగుదల నమోదు చేసుకోవటం చరిత్రాత్మకమైనదిగా భావిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 45 లక్షలు (44,97,867) చేరింది. ఈ ఎదుగుదల కారనంగా కోలుకున్నవారి శాతం 80.86కు చేరినట్టయింది.

కొత్తగా కోలుకున్న కేసులలో దదాపు 70% పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదయ్యాయి. అవి మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్.   వీటిలో మహారాష్ట్ర అన్నిటికంటే ఎక్కువగా 32,000 కేసులు ( 31.5%) కోలుకున్నట్టు నమోదు చేయగా ఆంధ్రప్రదేశ్ లో ఒకే రోజు కోలుకున్నవారి సంఖ్య 10,000 మందికి పైగా ఉంది.

WhatsApp Image 2020-09-22 at 10.10.32 AM.jpeg

ఈ విధంగా భారతదేశంలో కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతు ఉండటంతో ప్రపంచస్థాయిలో కూడా ఎక్కువమంది కోలుకున్న దేశంగా నిలిచింది,

WhatsApp Image 2020-09-22 at 10.25.57 AM.jpeg

ఈ విధంగా పెద్ద సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు కోలుకోవటానికి ప్రధాన కారణం కేంద్రం అనుసరిస్తున్న వ్యూహమే. పరీక్షించటం, ఆనవాలు పట్టటం, చికిత్స అందించటం అనే త్రిముఖ వ్యూహాన్ని సమర్థంగా, క్రియాశీలంగా అమలు చేయటం  వలనే ఇది సాధ్యమైంది. కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన, ప్రామాణికమైన  చికిత్సా విధానాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తెలియజేస్తూ, మార్గదర్శకాలను జారీచేయటం తగిన ఫలితాలనిచ్చింది. కొత్త పరిశోధనాఫలితాలు, అనుభవాలు వచ్చేకొద్దీ ఆ సమాచారాన్ని పంచుకోవటం కూడా ఈ ఫలితాలకు కారణం.

కేంద్ర ప్రభుత్వం రెమిడిసెవిర్, ప్లాస్మా, టొసిలిజుమాబ్ లాంటివి ప్రయోగాత్మకంగా, హేతుబద్ధంగా వాడుకోవటానికి అనుమతించటం, ఆక్సిజెన్ వాడకం, వెంటిలేటర్ల వినియోగం, స్టెరాయిడ్స్, యాంటీ కొయాగ్యులెంట్స్ వాడకాన్ని  సైతం అనుమతించటం వలన ఎక్కువమంది కోలుకొని బైటపడ్డారు. స్వల్ప లక్షణాలతో ఐసొలేషన్ లో ఉన్న బాధితులను క్రమం తప్పకుండా పర్యవేక్షించటం, బాధితులను ఆస్పత్రికి తరలించటానికి మెరుగైన అంబులెన్స్ సేవలు  లాంటివి సకాలంలో చికిత్స అందించటానికి ఉపయోగపడ్డాయి.

.న్యూ ఢిల్లీ ఎయిమ్స్ సహకారంతో ఆరోగ్య మంత్రిత్వశాఖ కోవిడ్ చికిత్సకు సంబంధించి జాతీయ ఈ-ఐసియు  నిర్వహించటం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ఆస్పత్రులలో ఐసియు లలో వైద్య సేవలందించే డాక్టర్లు  లబ్ధిపొందారు. వారానికి రెండు సార్లు మంగళ శుక్రవారాల్లో టెలీ కన్స్లటేషన్ ద్వారా నిపుణుల సలహాలు, అనుభవాలు తెలుసుకుంటూ చికిత్స అందించగలిగారు. బాధితులు పెద్ద సంఖ్యలో కోలుకోవటానికి ఈ సెషన్లు బాగా పనికొచ్చాయి. అదే సమయంలో మరణాల శాతాన్ని సైతం బాగా తగ్గించాయి. ఇప్పటివరకు అలాంటి 20 సెషన్ల వల్ల 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 278 ఆస్పత్రులు లబ్ధిపొందాయి.  

కేంద్రం వివిధ విభాగాల నిపుణులతో కూడిన కేంద్ర బృందాలను రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయంగా పంపిస్తూ వస్తోంది.క్రమం తప్పకుండా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించటం ద్వారా దేసమంతటా ఎప్పటికప్పుడు ఆక్సిజెన్ అందుబాటు లాంటి విషయాలు తెలుసుకొని లోటు రాకుండా చూడటం సాధ్యమైంది. ఇవన్నీ కలిసి ఉమ్మడిగా భారత్ లో కోలుకుంటున్న బాధితుల సంఖ్య పెరగటానికి దారితీసింది. ఆ విధంగా మరణాల శాతం కూడా బాగా తగ్గుతూ ప్రస్తుతం 1,59% అయింది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img