Homeజాతీయందేశంలో 75.9 శాతంకు పెరిగిన రికవరీ

దేశంలో 75.9 శాతంకు పెరిగిన రికవరీ

దేశంలో కొత్తగా 60975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3167323కి చేరింది. కొత్తగా 848 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 58390కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.8 శాతంగా ఉంది. గత 24 గంటల్లో దేశంలో 66550 మంది రికవరీ అయ్యారు. పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువగా ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు మరింత పెరిగి 75.9 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 704348కి చేరింది. నిన్న ఒక్క రోజే దేశంలో 925383 టెస్టులు చేశారు. ఇప్పటి వరకు దేశంలో చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 36827520కి చేరింది.

దేశంలో అత్యదికంగా కేసులున్న మహారాష్ట్రలో రికవరీలో 5 లక్షలు దాటాయి. కొత్త కేసులు 11వేలు రాగా… రికవరీలు 14 వేలకు పైగా వచ్చాయి. 19 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్‌లో యాక్టివ్ కేసులు బాగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న దేశాల్లో… అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. అలాగే… కొత్త కేసుల నమోదులో… ఇండియా టాప్ పొజిషన్‌లో కొనసాగుతోంది. మొత్తం మరణాల్లో… అమెరికా, బ్రెజిల్, మెక్సికో తర్వాత ఇండియా నాలుగో దశలో ఉంది. రోజువారీ మరణాల్లో భారత్ మళ్లీ మొదటి స్థానానికి చేరింది. ఆ తర్వాత బ్రెజిల్, అమెరికా ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img