Homeహైదరాబాద్గుడ్ న్యూస్: పది రోజుల్లో 7031 ఉద్యోగాలకు నియామక పత్రాలు..

గుడ్ న్యూస్: పది రోజుల్లో 7031 ఉద్యోగాలకు నియామక పత్రాలు..

చాలాకాలం నుంచి నిరుద్యోగులు ఎదురు చూస్తున్న స్టాఫ్‌ న‌ర్సు ఉద్యోగాల నియామ‌క ప్ర‌క్రియ ఎట్ట‌కేల‌కు తుది ద‌శ‌కు చేరింది. స్టాఫ్‌ న‌ర్సు ఉద్యోగాల మెరిట్ జాబితా ఈ రెండ్రుజుల్లో తెలియనుంది. అలాగే 10 రోజుల్లో ప్రభుత్వం నియామ‌క ఉత్త‌ర్వులు ఇవ్వ‌నుంది. ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తుంది. దీంతో మెడిక‌ల్ కాలేజీలతో పాటు.. ఆసుపత్రుల్లో 7031 మంది స్టాఫ్‌ న‌ర్సుల అందుబాటులోకి రానున్నారు.

ఈ ఉద్యోగాల‌కు 40,936 మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ ఉద్యోగాల తుది జాబితా ఏక్ష‌ణంలోనైన స‌మ‌ర్పించే అవ‌కాశం ఉంది. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం హాయంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో వివిధ నోటిఫికేషన్ల కింద మొత్తంగా 7,356 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ నోటిఫికేషన్‌లు అన్ని వివిధ దశలలో ఉన్నాయి. రాత పరీక్ష నిర్వహించి ‘కీ’ని కూడా విడుదల చేశారు. రెండు నెలల క్రితమే అభ్యంతరాలు స్వీకరించారు. మెరిట్ జాబితా విడుదలచేసి, నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img