Homeఅంతర్జాతీయంకెనడియన్లకు ఈ-వీసా సేవల పునరుద్ధరణ!

కెనడియన్లకు ఈ-వీసా సేవల పునరుద్ధరణ!

– జాతీయ మీడియాలో కథనాలు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఖలిస్థానీ అంశంపై భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 2 నెలలుగా కెనడా పౌరులకు నిలిపివేసిన ఈ-వీసా సేవలను భారత్‌ బుధవారం పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. జీ– 20 దేశాధినేతల వర్చువల్‌ సమావేశానికి ముందు ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. దౌత్యపరమైన ఉద్రికత్తల నేపథ్యంలో.. ఈ ఏడాది సెప్టెంబరు 21 నుంచి కెనడియన్లకు వీసా సర్వీసులను భారత్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని కొంత మార్చుకుంది. భద్రతాపరమైన పరిస్థితులను సమీక్షించిన అనంతరం అక్టోబర 26 నుంచి కెనడా పౌరులకు ఎంట్రీ వీసా, బిజినెస్‌ వీసా, మెడికల్‌ వీసా, కాన్ఫరెన్స్‌ వీసా కేటగిరీల్లో సేవలను పునరుద్ధరించారు. తాజాగా ఈ-వీసా సేవలను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు కెనడా పౌరులకు అన్ని రకాల వీసా సర్వీసులను భారత్‌ పునరుద్ధరించినట్లైంది.

Recent

- Advertisment -spot_img