Homeఫ్లాష్ ఫ్లాష్renu desai:రేణు దేశాయ్​ బోల్డ్​ స్టేట్​మెంట్​

renu desai:రేణు దేశాయ్​ బోల్డ్​ స్టేట్​మెంట్​

వైసీపీ కేడర్​ ఫుల్​ కన్ఫ్యూజన్​ ..

‘మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. నిలకడ లేని మనసు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తాడు? పార్టీని ఎలా నడుపుతాడు’ పవన్​ కల్యాణ్​ మీద తరుచూ వైసీపీ శ్రేణుల నుంచి.. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్​ నుంచి వచ్చే ప్రధాన ఆరోపణ. ఇక వైసీపీ సోషల్ మీడియా సైతం అవకాశం దొరికిన ప్రతీసారి పవన్​ కల్యాణ్​ మూడు పెళ్లిళ్ల మీద పోస్టులు పెడుతూ ఉంటుంది.
అయితే తాజాగా వైసీపీ క్యాడర్​ కు షాక్​ ఇచ్చేలా పవన్​ మాజీ భార్య రేణూ దేశాయ్ బోల్డ్​ కామెంట్స్​ చేశారు. పవన్​ కల్యాణ్​ ప్రజల మనిషి అని.. ఆయన ఎప్పుడూ జనం గురించే ఆలోచిస్తారని ఆమె అన్నారు. అంతేకాక మూడు పిల్లల్ల విషయం మీద ఆయనను విమర్శించడం సరికాదని కూడా సూచించారు. దీంతో ప్రస్తుతం వైసీపీ కేడర్​ కాస్త గందరగోళానికి గురైనట్టు తెలుస్తోంది.
పవన్​ మాజీ భార్య రేణు దేశాయ్​.. ఎప్పుడూ పవన్​ కు అనుకూలంగా మాట్లాడలేదు. పైగా ఫ్యాన్స్​ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేది. కానీ తాజాగా ఆమె పవన్​ కల్యాణ్​ కు కాస్త అనుకూలంగా మాట్లాడటం గమనార్హం.
ఎన్నికల వేళ పవన్​ కల్యాణ్​ కు కుటుంబం నుంచి కూడా సపోర్ట్​ వస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే అన్న చిరంజీవి సైతం పవన్​ కు అనుకూలంగా స్టేట్​ మెంట్​ ఇచ్చారు. తాజాగా మాజీ భార్య కూడా తోడయ్యారు. ఇక నాగబాబు ఎప్పటి నుంచి పవన్​ వెంటే ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తమకు మరింత బలం రాబోతున్నదని జనసైనికులు ఖుషీ అవుతున్నారు

Recent

- Advertisment -spot_img