ఇదేనిజం, జగదేవపూర్ : బీజేపీ జగదేవపూర్ మండల అధ్యక్షుడు ఐలయ్య ఏకపక్ష నిర్ణయాలతో పార్టీకి నష్టం జరుగుతోందని యువనాయకులు సుధాకర్, చంద్ర శేఖర్ రెడ్డి ఆరోపించారు. పార్టీ నూతన కమిటీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలను పట్టించుకోకుండా మొండిచేయి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో ఉంటున్నా పదవుల కేటాయింపులో ప్రాధాన్యత లభించడం లేదని వాపోయారు. పార్టీ పెద్దలు వెంటనే స్పందించి ఈ కమిటీని రద్దు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొట్టాల మల్లేశం, బత్తుల వెంకటేష్ యాదవ్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.