ఇదే నిజం, మెట్ పల్లి : గ్రూప్ వన్ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని మెట్ పల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ వేదవతి కి బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. జూన్ 9న పరీక్ష రాసే అభ్యర్థులు ప్రయాణించేందుకు వీలుగా డిపో పరిధిలోని అన్ని రూట్లలో ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. నాయకుల అభ్యర్థనపై డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించారు. ప్రత్యేక బస్సుల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఆకుల ప్రవీణ్, మొరపు తేజ, గుండవేని ప్రణయ్ గౌడ్, శ్యామ్ ప్రసాద్, సలీం, అభిషేక్, రాజు తదితరులు పాల్గొన్నారు.