ఇదే నిజం, మల్కాజిగిరి: మల్కాజిగిరి, అల్వాల్, నేరేడ్మెట్, వినాయకనగర్ ప్రాంతాలకు చెందిన స్థానిక ప్రజలు, నేతలు శుక్రవారం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వాళ్లు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, రోడ్డు, కమ్యూనిటీ హాల్ తదితర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో తలెత్తుతున్న సమస్యలు గురించి జీహెచ్ఎంసీ సమావేశంలో మాట్లాడేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.