Homeఫ్లాష్ ఫ్లాష్కొత్త మాస్టర్ కార్డులు జారీ నిషేధం : #ReserveBank #MasterCard

కొత్త మాస్టర్ కార్డులు జారీ నిషేధం : #ReserveBank #MasterCard

భారత్‌లోని వినియోగదారులకు కొత్త డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ చేయకుండా మాస్టర్ కార్డ్‌పై రిజర్వ్ బ్యాంక్ నిరవధిక నిషేధం విధించింది.

మాస్టర్ కార్డ్ కంపెనీ డేటా స్టోరేజ్ చట్టాలను ఉల్లంఘించిందని రిజర్వ్ బ్యాంక్ ఆరోపించింది.

ప్రత్యేకంగా భారత్‌లో జరిగే చెల్లింపులకు సంబంధించిన డేటాను నిల్వ చేయడానికి విదేశీ కార్డ్ నెట్‌వర్క్‌లు అనుసరించాల్సిన నిబంధనలను మాస్టర్ కార్డ్ పాటించలేదని బ్యాంక్ చెప్పింది.

దీనిపై మాస్టర్ కార్డ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

జులై 22 నుంచి మాస్టర్ కార్డ్ భారత వినియోగదారులకు డెబిట్, క్రెడిట్ లేదా ప్రీపెయిడ్ కార్డులు జారీ చేయకుండా నిషేధించారు.

రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం వల్ల ప్రస్తుతం మాస్టర్ కార్డ్ వినియోగిస్తున్న వారిపై ఎలాంటి ప్రభావం పడదు.

భారతదేశంలో జరిగే చెల్లింపుల డేటాను నిల్వ చేయాలని నిర్దేశిస్తూ 2018లో ఇచ్చిన ఆదేశాలను మాస్టర్ కార్డ్ ఉల్లంఘించిందని ఆర్బీఐ చెప్పింది.

చాలా సమయం, తగినన్ని అవకాశాలు ఇచ్చినా డేటా స్టోరేజ్ పేమెంట్‌కు సంబంధించిన ఆదేశాలను అది పాటించలేదని తాము గుర్తించామని రిజర్వ్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్‌లో చెప్పింది.

గత ఏడాది భారత్‌లో జరిగిన మొత్తం కార్డు చెల్లింపుల్లో మాస్టర్ కార్డ్ వాటా 33 శాతం ఉన్నట్లు లండన్ ఆధారిత పేమెంట్స్ స్టార్టప్ పీపీఆర్ఓ ఏఎఫ్‌పీకి చెప్పింది.

ఈ ఏడాది మొదట్లో ఇలాంటి ఉల్లంఘనలకే పాల్పడిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్‌ కొత్త కార్డులు జారీ చేయకుండా ఆర్బీఐ నిషేధం విధించింది.

Recent

- Advertisment -spot_img