Homeహైదరాబాద్latest Newsఏపీలో న్యాయాధికారుల పదవీ విరమణ వయసు పెంపు

ఏపీలో న్యాయాధికారుల పదవీ విరమణ వయసు పెంపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జ్యుడిషియల్ అధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ సవరణ బిల్లును ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టారు. నవంబరు ఒకటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బిల్లులో పేర్కొన్నారు. నవంబర్ 2024 నుంచి 2026 మార్చి వరకు పదవీ విరమణ చేయనున్న 13 మంది అధికారులకు ఈ ప్రయోజనం లభిస్తుందని బిల్లులో పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img