Homeహైదరాబాద్latest Newsప్రతీ ఉద్యోగికి విరమణ తప్పనిసరి: డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శ్రీనివాస్

ప్రతీ ఉద్యోగికి విరమణ తప్పనిసరి: డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శ్రీనివాస్

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి నేరెళ్ల గ్రామంలో పదవి విరమణ జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు..ధర్మపురి మండలం నేరెళ్ల పీహెచ్ సీ లో నర్సింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన ఇందిర క్రీస్తు కుమారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు… ఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సింగ్ ఆఫీసర్ గా ఇందిర క్రీస్తు కుమారి నిబద్ధతతో పనిచేశారన్నారు.. రోగులు తోటి సిబ్బందితో స్నేహభావంతో ఉంటూ సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణతో విధులు నిర్వహించారని ఆమెను నర్సింగ్ సిబ్బంది ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ..అనంతరం సిబ్బంది మాట్లాడుతూ .. ఆమె సేవలు మరువలేనివని ఆమెను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉందని గుర్తు చేసుకున్నారు ..అనంతరం శాలువాలు , పూలమాలలతో ఇందిరా క్రీస్తు కుమారుని ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ అవంతిక , డాక్టర్ నరేష్, సీనియర్ జర్నలిస్టు చిలుముల రాజేందర్ తదితరులున్నారు.

Recent

- Advertisment -spot_img