Homeహైదరాబాద్latest Newsరూ.500 బోనస్ ఇస్తామని రేవంత్ మోసం.. కోరుట్లలో రోడ్డెక్కిన బీఆర్ఎస్ శ్రేణులు

రూ.500 బోనస్ ఇస్తామని రేవంత్ మోసం.. కోరుట్లలో రోడ్డెక్కిన బీఆర్ఎస్ శ్రేణులు

కోరుట్ల, ఇదే నిజం: వరి ధాన్యంకు బోనస్ ఇస్తాని మాటిచ్చి..మెలికపెట్టినందుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు కేసిఆర్ పిలుపు మేరకు కోరుట్లలో గురువారం రోడ్డెక్కారు. వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం,రేవంత్ రెడ్డి .. ఇప్పుడు కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిందని స్థానిక ఎమ్మెల్యే సంజయ్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు నేతృత్వంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేసిందని మండిపడ్డారు.రాస్తారోకో తర్వాత తాశీల్దారు కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు.

Recent

- Advertisment -spot_img