తమ భర్తలకు, కుటుంబాలకు న్యాయం కోసం పోరాడుతున్న పోలీసు కానిస్టేబుల్ భార్యపై యూనిఫాం లో ఉన్న మరో పోలీసు కానిస్టేబుల్ చేయి చేసుకునే స్థాయికి ఒక గొప్ప చరిత్ర ఉన్న తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్ ను దిగజార్చారు రేవంత్ రెడ్డి గారు.
తమరు నిజంగా చరిత్రలో నిలిచిపోతారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు ట్వీట్ చేశారు.
బెటాలియన్లలో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుళ్లను కూలీ పనులు చేయిస్తున్నారని, వెంటనే వన్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళనకు దిగారు. బెటాలియన్ల ముందు ధర్నాకు దిగిన కానిస్టేబుళ్ల భార్యలను మహిళా పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా జీపు ఎక్కించారు. ఈ ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.పోలీసు కుటుంబాల బాధలు వినడానికి సీఎంకి సమయం లేదని, కనీసం మీరు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు.