హుజురాబాద్లో దళిత బంధు డబ్బులు విడుదల చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధర్నాకు దిగారు. అయితే ఈ క్రమంలో పోలీసులు కౌశిక్ రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బలవంతంగా పోలీసు వాహనంలో నెట్టి పోలీసులు అరెస్ట్ చేసారు.ఈ తోపులాటలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సృహ తప్పి పడిపోయిరు. ఈ ఘర్షణలో ఊపిరాడక కౌశిక్ రెడ్డి కంటతడి పెట్టారు. రేవంత్ రెడ్డి నా మీద హత్యాయత్నం చేయిస్తున్నాడు అని అన్నారు. ప్రాణం పోయే వరకు నా దళిత బిడ్డల కోసం పోరాడుతా.. అని తెలిపారు. దళిత బంధు ఎందుకు ఇవ్వరు అని అడిగితే ఈ విధంగా లాఠీ ఛార్జ్ చేస్తారా అని పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.