Homeహైదరాబాద్latest NewsLIVE : రేవంత్ ప్రెస్‌మీట్

LIVE : రేవంత్ ప్రెస్‌మీట్

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధంగా మోదీ, అమిత్ షా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల కోసం కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని గుర్తు చేశారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారన్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

  1. దేశంలో బీసీలు 50 శాతానికి పైగా ఉన్నారు : సీఎం రేవంత్
  2. జనాభా దామాషా ప్రకారమే రిజర్వేషన్లు కల్పించాలని రాహుల్ గాంధీ అనుకుంటున్నారు : సీఎం రేవంత్
  3. వచ్చే ఏడాదికి ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఆ సమయానికి రిజర్వేషన్లు ఉండకూడదనేది దాని విధానం : సీఎం రేవంత్
  4. రాజ్యాంగాన్ని మార్చాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. అందుకే 400 సీట్లు సాధించే పనిలో మోదీ ప్రభుత్వం ఉంది : సీఎం రేవంత్
  5. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి నిర్ణయాలన్నీ ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం నుంచి వచ్చినవే : సీఎం రేవంత్
  6. ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి రిజర్వేషన్ల విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు : సీఎం రేవంత్
  7. బీజేపీ చేస్తోన్న కుట్రపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు : సీఎం రేవంత్
  8. రిజర్వేషన్ల రద్దుపై బీఆర్‌ఎస్, బీజేపీ ఒకే విధానంతో ఉన్నాయి : సీఎం రేవంత్
  9. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎందుకు చర్యలు తీసుకోలేదు : సీఎం రేవంత్
  10. 5 నియోజకవర్గాల్లో బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతునిస్తోంది : సీఎం రేవంత్
  11. మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న అమిత్ షా వ్యాఖ్యలపై కేసీఆర్ ఇప్పటివరకూ స్పందించలేదు : సీఎం రేవంత్
  12. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఉండాలి, పెంచాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలి : సీఎం రేవంత్
  13. జూబ్లీహిల్స్ పెద్దమ్మ సాక్షిగా మాటిస్తున్నా. ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి తీరుతా : సీఎం రేవంత్
  14. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది. అధికారులు నివేదిక ఇచ్చేంతవరకు టెలిఫోన్ ట్యాపింగ్ విషయంపై స్పందించదల్చుకోలేదు : సీఎం రేవంత్
  15. పదేళ్లలో దేశాన్ని నాశనం చేసిన మోదీని తప్పుబట్టడం పోయి, కొత్తగా ఏర్పడి పనులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకోవడమనేది మూర్ఖత్వం : సీఎం రేవంత్
  16. కేసీఆర్‌కు ఇంకా గర్వం తగ్గలేదు. మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. : సీఎం రేవంత్

Recent

- Advertisment -spot_img