Homeహైదరాబాద్latest Newsరేవంత్ రెడ్డి : తెలంగాణ ఏర్పాటులో సుష్మ స్వరాజ్ పాత్ర కీలకం

రేవంత్ రెడ్డి : తెలంగాణ ఏర్పాటులో సుష్మ స్వరాజ్ పాత్ర కీలకం

ఇదేనిజం, వెబ్‌డెస్క్ : నేటికీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి సరిగ్గా 10 సంవత్సరాలు పూర్తయింది. ప్రతి ఏడాది జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటాము. ఇందులో భాగంగా నేడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు పరేడ్ గ్రౌండ్స్ లో వైభవంగా నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఈ వేడుకల్లో అందేశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ పాటను తెలంగాణ రాష్ట్ర గేయంగా జాతికి అంకితమిచ్చారు. ఈ క్రమంలో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కృషి చేసిన ప్రతి ఒకర్ని ఆయన పేరు పేరునా కొనియాడారు. తెలంగాణ బిల్లు ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని సభా ముఖంగా తెలిజేశారు. అలాగే మొట్టమొదటిగా ప్రత్యేక రాష్ట్రము ఏర్పాటు కోసం యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ ఎంతోగానో కృషి చేశారని అన్నారు. వారితో పాటు మీరా కుమార్, సుష్మ స్వరాజ్ పాత్రలు కూడా చాలా ముఖ్యమైనవి అని అన్నారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ ఎంపీ సుష్మ స్వరాజ్ సంపూర్ణ మద్దతు ఇచ్చారు అని గుర్తు చేసారు.

Recent

- Advertisment -spot_img