HomeరాజకీయాలుRevanth Reddy : BRS, BJP నేతల ఇళ్లపై IT Rides ఎందుకు జరగట్లే?

Revanth Reddy : BRS, BJP నేతల ఇళ్లపై IT Rides ఎందుకు జరగట్లే?

– రాష్ట్రంలో కాంగ్రెస్​ సునామీకి మోడీ, కేసీఆర్ భయపడుతున్నరు
– పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి విమర్శలు

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు దేనికి సంకేతమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ఖమ్మంలో నేడు పొంగులేటి, బుధవారం తుమ్మల, అంతకుముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు రేవంత్‌ గురువారం ఓ ట్వీట్‌ చేశారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ, కేసీఆర్ భయపడుతున్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుట్ర ఇది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం’అని రేవంత్‌ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img