Homeతెలంగాణక‌నిక‌రం లేని సీఎం కేసీఆర్‌: రేవంత్ రెడ్డి

క‌నిక‌రం లేని సీఎం కేసీఆర్‌: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: అసెంబ్లీ సమీపంలో నాగులు ఆత్మహత్యాయత్నం తీవ్రంగా కలచివేసిందని కాంగ్రెస్ ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. నాగులు ఆర్తనాదాలలో తెలంగాణ నిరుద్యోగ యువత గుండె చప్పుడు ఉందని, తెలంగాణ ఉద్యమ కాల ఆత్మబలిదానాలను మ‌ళ్లీ గుర్తుకు తెచ్చిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేసీఆర్ కనికరం లేని ముఖ్యమంత్రి అని విమర్శించారు. నాడు యువత శవాల వద్ద కేసీఆర్ కార్చింది కన్నీరా… మొసలి కన్నీరా? అనేది స్పష్టం చేయాలన్నారు. కేసీఆర్ తీరుతో బలిదానాలు చేసుకున్న యువత ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. మంత్రి కేటీఆర్ సూటూ బూటూ వేసుకుని బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో ఫోటోలు దిగితే ఉద్యోగాలు వచ్చినట్టేనా అని రేవంత్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ హామీలు మీడియాలో హెడ్ లైన్స్ వచ్చాయి తప్ప… యువతకు ఉద్యోగాలు రాలేదన్నారు. నాగులుకు మెరుగైన వైద్యం ప్రభుత్వమే అందించాలి, ఉపాధికి హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యపై తక్షణ కార్యచరణ ప్రకటించాలన్నారు. కేసీఆర్ స్పందించకుంటే… నిరుద్యోగ యువత తరఫున త్వరలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఉద్యమం చేస్తానని ఎంపీ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img