Homeహైదరాబాద్latest Newsకేసీఆర్‌కు రేవంత్ ఇన్విటేషన్

కేసీఆర్‌కు రేవంత్ ఇన్విటేషన్

మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరవాల్సిందిగా లేఖ ద్వారా ఆహ్వానాన్ని పంపారు. లేఖను స్వయంగా కేసీఆర్‌కు అందించాలని ప్రభుత్వ సలహాదారు ప్రోటోకాల్ ఇన్‌చార్జ్, హర్కర వేణుగోపాల్, ప్రోటోకాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్‌లకు బాధ్యతలు అప్పగించారు. జూన్ 2న జరిగే వేడుకలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ హాజరుకానున్నారు. జాతీయ జెండా ఎగరేసిన తర్వాత రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులను ఆహ్వానించినట్లు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img