Homeహైదరాబాద్latest Newsరేవంత్ బురద రాజకీయం.. పరామర్శలు వదిలి ప్రత్యర్థులను టార్గెట్..!

రేవంత్ బురద రాజకీయం.. పరామర్శలు వదిలి ప్రత్యర్థులను టార్గెట్..!

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బురద రాజకీయలకు తెరలేపారా? అత్యంత విపత్కర సమయంలోనూ రాజకీయాలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ కు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు మీద సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఆదివారం నాడు మున్నేరు వాగు ఉప్పొంగింది. ఖమ్మం పట్టణం మొత్తం మునిగిపోయింది. టీవీల్లో, సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు.. ఆర్తనాథాలు, హాహాకారాలు వినిపించాయి. కానీ ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదు.

ఇద్దరు మంత్రులు తుమ్మల, పొంగులేటి కొంత హడావుడి చేసినా ప్రజల ప్రాణాలు కాపాడలేకపోయారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు. ఒక్క సమీక్ష లేదు.. కనీసం సెక్రటేరియట్ కు వెళ్లలేదు.. అధికారులను అలర్ట్ చేయలేదు.. అసలు వరద విపత్తును ఎలా ఎదుర్కోవాలి? అన్న విషయంపై ప్రభుత్వానికి కనీస అవగాహన లేకుండా పోయింది. అధికారులు సైతం మొక్కుబడిగా పనిచేశారు. ఏ ఒక్కరిలోనూ ఈ విపత్తును ఎలా కట్టడి చేయాలి? అన్న ఆందోళన కనిపించలేదు. చివరకు తీవ్ర విమర్శలు రావడంతో సాయంత్రానికి ఓ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు మీడియాకు లీకులు ఇచ్చారు.

ప్రధాని నరేంద్రమోడీ పొగిడినట్టు సీఎంవో కార్యాలయం నుంచి ఓ ప్రకటన ఇప్పించుకున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓ యువ శాస్త్రవేత్త ను తాను కాపాడలేకపోయానంటూ పొంగులేటి కన్నీరు పెట్టుకొని ఓ డ్రామా చేశారు. అసలు ఆ బాధితురాలు గంటల తరబడి వరదలో చిక్కుకపోయింది. ప్రభుత్వం తలుచుకుంటే కాపాడే అవకాశం ఉంది. కానీ సమయానికి హెలీక్యాప్టర్లు అందుబాటులోకి లేకపోవడంతో నిండుప్రాణం బలైంది. ఇంత స్పష్టంగా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తే.. పొంగులేటి కన్నీరు పెట్టుకొని ఏదో డ్రామా చేశారు. మరో మంత్రి భట్టి ఖమ్మంలోనే లేరు. ఆలస్యంగా మేల్కొన్న తుమ్మలను జనం తిట్టిపోశారు.

పత్రికల్లో, సోషల్ మీడియాల్లో సర్కారును జనం తిట్టిపోశారు. ముఖ్యమంత్రికి శాపనార్థాలు పెట్టారు. ఇంటెలిజెన్స్ ద్వారా నివేదిక అందడటంతో ముఖ్యమంత్రి మరుసటి రోజు హడావుడి చేశారు. అక్కడా నిరసనే ఎదురైంది. ఎందుకంటే వరద బాధితులను ఆదుకోవడంలో సర్కారు ఫెయిల్ అయ్యిందని క్లియర్ గా అర్థం అవుతోంది. పక్క రాష్ట్రంలో చంద్రబాబు బోట్ల మీద.. బుల్డోజర్ల మీద తిరుగుతూ హడావుడి చేశారు. రాత్రంతా కలెక్టరేట్ లోనే ఉండి నిద్రాహారాలు మాని వరద పరిస్థితిని అంచనా వేశారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు.

Recent

- Advertisment -spot_img