Homeలైఫ్‌స్టైల్‌#Secret #Age : వయసు రహస్యం

#Secret #Age : వయసు రహస్యం

విజ్ఞానం ఎంతగా విస్తరించినా వృద్ధాప్యాన్ని మాత్రం అడ్డుకోలేకపోతున్నది.

ఆ మాటకొస్తే, అసలు వయసును ఆపడం ఎవరి తరమూ కాదని చాలామంది శాస్త్రవేత్తలు చేతులెత్తేశారు కూడా.

కానీ మనిషి ఊరుకోడు కదా! శోధిస్తూనే ఉంటాడు, సాధిస్తూనే ఉంటాడు. అలాంటి పరిశోధనే ఇది.

వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఎట్టకేలకు వయసును నియంత్రించే జన్యువును తాము కనుగొన్నట్టు చెబుతున్నారు.

మన కణాలు ఎప్పటికప్పుడు చనిపోతూ, సరికొత్త కణాలు ఉద్భవిస్తాయన్న సంగతి తెలిసిందే.

జన్యువుల చివర ఉన్న ‘టెలొమీర్‌’ అనే భాగం ఈ విభజనను శాసిస్తుంది.

వయసు పెరుగుతున్నప్పుడు లేదా ప్రాణాంతక అనారోగ్యాలు దరిచేరినప్పుడూ టెలొమీర్‌ క్రమంగా అరిగిపోతుంది.

దాంతో కణవిభజన ఆగిపోతుంది, మరణం చేరువవుతుంది. టెలొమీర్‌ అరుగుదలను ప్రభావితం చేయగల అంశం ఏదైనా ఉందేమో కనుక్కోవాలనుకున్నారు పరిశోధకులు.

ఆ ప్రయత్నంలో వేర్వేరు జాతులకు చెందిన వ్యక్తుల మీద పరిశోధనలు చేశారు. అలాగే నూరేండ్లు దాటినవారి జన్యుపటాలను కూడా విశ్లేషించారు.

దాదాపు 20 ఏండ్లుగా సాగిన ఈ పరిశోధనలో… VNTR2-1 అనే పదార్థం టెలొమీర్‌ను నియంత్రిస్తున్నట్టు తేలింది.

వయసు రహస్యం వీడింది. ఇక ఆ వయసు మీద పట్టు సాధించడమే తరువాయి.

Recent

- Advertisment -spot_img