Homeహైదరాబాద్latest NewsRIP Ramoji Rao: తెలుగు సినిమాలో రామోజీ 'ఉషాకిరణం'

RIP Ramoji Rao: తెలుగు సినిమాలో రామోజీ ‘ఉషాకిరణం’

ప్రముఖ మీడియా అధినేత రామోజీ రావు శనివారం తుదిశ్వాస విడిచారు. ‘ఉషాకిరణ్ మూవీస్’తో సినీ పరిశ్రమపైనా రామోజీరావు తనదైన ముద్ర వేశారు. తెలుగు, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో 80కిపైగా ఫీల్ గుడ్ చిత్రాలు నిర్మించారు. ఎందరో నటులు, దర్శకులు, సంగీత దర్శకులను పరిచయం చేశారు. కీరవాణి, శ్రీకాంత్, ఉదయ్ కిరణ్, తరుణ్, డైరెక్టర్ తేజ, జెనీలియా, శ్రియ మొదలైన ప్రముఖులు అలా వచ్చిన వారే. ఆయన సినిమాల్లో ‘నువ్వే కావాలి’కి జాతీయ అవార్డు రాగా మరికొన్నింటిని నందీ అవార్డులు వరించాయి.

రామోజీరావు నిర్మించిన సినిమాలు ఇవే.. శ్రీవారికి ప్రేమలేఖ(1984), మయూరి(1985), మౌన పోరాటం(1989), ప్రతిఘటన(1987), పీపుల్స్ ఎన్‌కౌంటర్(1991), అశ్వని(1991), మెకానిక్ మామయ్య(1999), మూడుముక్కలాట (2000), చిత్రం, నువ్వే కావాలి(2000), ఇష్టం(2001), ఆనందం (2001), ఆకాశ వీధిలో(2001), నిన్ను చూడాలని(2001), తుఝె మేరీ కసమ్, వీధి(2005), నచ్చావులే(2008), నిన్ను కలిశాక(2009), దాగుడుమూత దండాకోర్(2015) వంటి 87 సినిమాలను రామోజీరావు నిర్మించారు.

Recent

- Advertisment -spot_img