HomeTelugu NewsWGL: అర్ధరాత్రి ఘోరప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

WGL: అర్ధరాత్రి ఘోరప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కంబాలపల్లి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అర్బన్ పార్క్ వద్ద ఆటో, కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. మృతులను గూడూరు మండలం చిన్న ఎల్లాపురం ఆమూతండాకు చెందిన ఆటో డ్రైవర్ ఇస్తావత్ శ్రీను(35), అతని తల్లి పాప(60), కుమారుడు రిత్విక్(4), కుమార్తె రిత్విక(2)గా గుర్తించారు. ఆటోలో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img