HomeSocial MediaBIG BREAKING: తెలంగాణలో ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్

BIG BREAKING: తెలంగాణలో ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని బాలనగర్ మండల కేంద్రంలో డీసీఎం ఆటోను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాల ప్రకారం.. వారం సంత దినం కావడంతో కూరగాయలు, సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగింది. మృతులంతా మండలంలోని మోతి ఘనాపూర్ గ్రామానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img