Homeమరిన్నిRobotic Surgery : క్యాన్సర్స్‌ చికిత్స కోసం అత్యాధునిక రోబోటిక్‌ సర్జరీ

Robotic Surgery : క్యాన్సర్స్‌ చికిత్స కోసం అత్యాధునిక రోబోటిక్‌ సర్జరీ

Robotic Surgery : క్యాన్సర్స్‌ చికిత్స కోసం అత్యాధునిక రోబోటిక్‌ సర్జరీ

Robotic Surgery – అత్యున్నతమైన సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో ఒకటిగా నిలిచిన అపోలో క్యాన్సర్‌ సెంటర్స్‌ (ఏసీసీ) అత్యాధునికమైన టెరిషియరీ కేర్‌ను ఆంకాలజీ, న్యూరాలజీ మరియు న్యూరోసర్జరీ వంటి విభాగాలలో అందిస్తుంది.

ఇది  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అత్యాధునిక రోబోటిక్‌ సర్జరీ చికిత్సను కొలొరెక్టల్‌ క్యాన్సర్‌ రోగుల కోసం ప్రత్యేకమైన శస్త్రచికిత్స నిపుణులతో అందిస్తుంది.

భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తున్న ఏడవ సాధారణ క్యాన్సర్‌లో ఒకటిగా  కొలొరెక్టల్‌ క్యాన్సర్‌ నిలుస్తుంది మరియు మహిళలలో అతి సాధారణంగా కనుగొనబడుతున్న రెండవ సాధారణ క్యాన్సర్‌గా మరియు మగవారిలో గుర్తించబడుతున్న మూడవ అతి సాధారణ క్యాన్సర్‌గా గుర్తింపు పొందింది.

గ్లోబోకాన్‌ ఇండియా 2020 ఇటీవల అందించిన సమాచారం ప్రకారం, 31వేలకు పైగా నూతన కేసులు గత సంవత్సరం అత్యధిక మరణాల రేటుతో నమోదయ్యాయి.

తగిన చికిత్సనందించడం కోసం సమయానికి ఈ క్యాన్సర్‌ను గుర్తించడం అత్యంత కీలకం.

పెద్దప్రేగు మరియు రెక్టమ్‌ (పురీషనాళము)లాంటి  ఎన్నో క్యాన్సర్‌లలో అపారమైన పరిశోధన జరుగుతుంది.

అందువల్ల సమయానికి దీనిని గుర్తించగలిగితే మెరుగైన చికిత్సనందించడం వీలవుతుంది.

అపోలో క్యాన్సర్‌ సెంటర్‌, విశాఖపట్నం ఇప్పుడు డాక్టర్‌ వెంకటేష్‌ మునికృష్ణన్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, కొలొరెక్టల్‌ సర్జరీ, అపోలో హాస్పిటల్స్‌, చెన్నై మార్గనిర్దేశకత్వంలో ప్రత్యేక బృందాన్ని తీసుకువచ్చింది.

భారతదేశంలో అత్యధిక సంఖ్యలో రోబోటిక్‌ కొలొరెక్టల్‌ శస్త్రచికిత్సలను చేసిన వ్యక్తిగా డాక్టర్‌ వెంకటేష్‌ మునికృష్ణన్‌ ఖ్యాతి గడించారు.

ఈ బృందంలో  డాక్టర్‌ టీ నారాయణ రావు, సీనియర్‌ కన్సల్టెంట్‌ –సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్‌ రోబోటిక్‌ సర్జన్‌ , అపోలో క్యాన్సర్‌ సెంటర్స్‌,

పూర్వ ప్రొఫెసర్ అండ్ క్లీనికల్ సర్జన్, ఆంధ్ర మెడికల్ కాలేజీ, కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం మరియు డాక్టర్‌ కార్తీక్‌ చంద్ర వల్లం, కన్సల్టెంట్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ అండ్‌ రోబోటిక్‌ సర్జన్‌, అపోలో క్యాన్సర్‌ సెంటర్స్‌, విశాఖపట్నం ఉన్నారు. 

వైజాగ్‌ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో, సన్నీవేల్‌ మరియు లాస్‌ ఏంజిల్స్‌లోని కెక్‌ మెడికల్‌ సెంటర్‌ నుంచి అత్యాధునిక కొలొరెక్టల్‌రోబోటిక్‌ సర్జరీలో శిక్షణ పొందిన మొట్టమొదటి సర్జన్‌ డాక్టర్‌  కార్తీక్‌.

ఈ సందర్భంగా డాక్టర్‌ వెంకటేష్‌ మునికృష్ణన్‌, ఎంబీబీఎస్‌, ఎంఆర్‌సీఎస్‌, ఎఫ్‌ఆర్‌సీఎస్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ – కొలొరెక్టల్‌ సర్జరీ, అపోలో హాస్పిటల్స్‌, చెన్నై మాట్లాడుతూ ‘‘

ప్రపంచవ్యాప్తంగా జీర్ణాశయాంతర క్యాన్సర్‌లలో అతి సాధారణంగా కనిపించే క్యాన్సర్‌గా కొలొరెక్టల్‌ క్యాన్సర్‌ (సీఆర్‌సీ) నిలుస్తుంది.

ఈ క్యాన్సర్‌లో ప్రధాన సమస్య ఏమిటంటే, సాధారణంగా ఈ క్యాన్సర్‌ను వ్యాధి ముదిరిన దశలో  మాత్రమే గుర్తిస్తుండటం. దాదాపు 25 సంవత్సరాలుగా నేను రెక్టల్‌ క్యాన్సర్‌ల కోసం శస్త్రచికిత్సలను చేస్తూనే ఉన్నాను.

వాటిలో ఒపెన్‌, ల్యాప్రోస్కోపిక్‌ మరియు ఇప్పుడు రోబో అసిస్ట్‌ శస్త్రచికిత్సలు ఉన్నాయి.

రోగి కోలుకోవడం కోణం నుంచి చూస్తే, రోబో అసిస్టెడ్‌ సర్జరీలలో వారు వేగంగా కోలుకుంటారు.

హాస్పిటల్‌లో గడిపే సమయం తగ్గుతుంది. వేగంగా ప్రేగులు తిరిగి పనిచేయడం ప్రారంభమవుతుంది మరియు అతి తక్కువగా రక్తం నష్టపోవడమూ జరుగుతుంది.

అపోలో క్యాన్సర్‌ సెంటర్స్‌ వద్ద సర్జన్స్‌,  కొలొరెక్టల్‌ క్యాన్సర్‌ శస్త్రచికిత్సల కోసం అత్యంత సున్నితమైన, అత్యంత క్లిష్టమైన ప్రక్రియలను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారు.

అపోలో క్యాన్సర్‌ సెంటర్స్‌ వద్ద మా క్యాన్సర్‌  నిపుణులు రోగులకు అత్యుత్తమ చికిత్స మరియు రక్షణను అందించేందుకు కట్టుబడి ఉన్నారు’’ అని అన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ టీ నారాయణ రావు, ఎంఎస్‌, ఎఫ్‌ఐసీఎస్‌, ఎఫ్‌ఏసీఎస్‌, ఎఫ్‌ఆర్‌సీఎస్‌ (గ్లాస్గో), సీనియర్‌ కన్సల్టెంట్‌– సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్‌ రోబోటిక్‌ సర్జన్‌, అపోలో క్యాన్సర్‌ సెంటర్స్‌ ,

పూర్వ ప్రొఫెసర్ అండ్ క్లీనికల్ సర్జన్, ఆంధ్ర మెడికల్ కాలేజీ, కింగ్ జార్జ్ హాస్పిటల్ , విశాఖపట్నం మాట్లాడుతూ ‘‘భారతదేశంలో అతి సాధారణంగా కనిపిస్తున్న ఏడవ క్యాన్సర్‌గా కొలొరెక్టల్‌ క్యాన్సర్స్‌ నిలుస్తున్నాయి.

కొలొరెక్టల్‌  క్యాన్సర్‌కు ప్రధానమైన చికిత్సగా సర్జరీ  నిలుస్తుంది.

తాజా చికిత్స అవకాశంగా  కనీస కోత పద్ధతులైనటువంటి రోబోటిక్‌ కొలరెక్టల్‌ సర్జరీ నిలుస్తుంది.

ఓపెన్‌ లేదంటే ల్యాప్రోస్కోపిక్‌ సర్జరీలతో పోలిస్తే రోబో అసిస్టెడ్‌ సర్జరీలతో వినూత్నమైన ప్రయోజనాలూ ఉన్నాయి.

అపోలో క్యాన్సర్‌ సెంటర్స్‌ వద్ద మేమెప్పుడూ రోగి సంరక్షణను వృద్ధి చేస్తూనే ఉంటాము.

దీనికోసం  సాంకేతికతను మరియు స్పెషలైజ్డ్‌ యూనిట్లను  గరిష్టంగా వినియోగించుకుంటాము’’ అని అన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ కార్తీక్‌ చంద్ర వల్లమ్‌, ఎంఎస్‌, ఎంసీహెచ్‌, డీఎన్‌బీ, కన్సల్టెంట్‌–సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ అండ్‌ రోబోటిక్‌ సర్జన్‌, అపోలో క్యాన్సర్‌ సెంటర్స్‌, విశాఖపట్నం మాట్లాడుతూ ‘‘

కొలొరెక్టల్‌ క్యాన్సర్‌ చికిత్స దగ్గరకు వచ్చేసరికి ఇది వైవిధ్యమైన కారణాల మీద ఆధారపడి ఉంటుంది.

కొలొరెక్టల్‌ క్యాన్సర్‌ తొలి దశలలో శస్త్రచికిత్స ద్వారా  క్యాన్సర్‌ పాలిప్స్‌ను సర్జన్‌ తీసివేయడం సాధ్యమవుతుంది.

లోతుగా కోత కోయాల్సిన శస్త్రచికిత్సలకు రోబోటిక్‌ సర్జరీలు అనుకూలంగా ఉంటాయి.

రోబో–అసిస్టెడ్‌ సర్జరీలో  అత్యాధునిక కంప్యూటర్‌ సాంకేతికత ఉంటుంది.

ఇది సర్జన్‌కు 10 రెట్లు అధికంగా, అత్యంత స్పష్టమైన రీతిలో  క్లిష్టమైన శరీర నిర్మాణ శాస్త్రపు 3డీ చిత్రం చూపుతుంది.

కన్సోల్‌పై ఉన్న కంట్రోల్స్‌తో  సర్జన్‌ , అతి చిన్నగా మరియు అత్యంత సౌకర్యవంతంగా, మనిషి చేతికన్నా మెరుగ్గా వంచకలిగన రీతిలో ఉండేటటువంటి ప్రత్యేకమైన సర్జికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో   శస్త్రచికిత్స చేయడం సాధ్యమవుతుంది’’ అని అన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img