టీ20 వరల్డ్‌కప్ గెలిచిన నేపథ్యంలో టీ20 కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ టెస్టులు, వన్డేలు ఆడుతాడా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇంకొన్నాళ్లపాటు టెస్టులు, వన్డేల్లో ఆడనున్నట్లు రోహిత్ తెలిపాడు. వరల్డ్‌టెస్ట్ చాంపియన్‌షిప్‌తో పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి రోహిత్‌శర్మనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఇటీవల బీసీసీఐ కార్యదర్శి జేషా పేర్కొన్న విషయం తెలిసిందే.