Rowdy Star : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ”కింగ్‌డమ్” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయినిగా నటిస్తుంది. ఇటీవలే విడుదలైన టీజర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ హిట్టు కొట్టాలని కోసం విజయ్ చూస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది అని సినీ వర్గాల్లో టాక్ నడస్తుంది. ముందుగా ”కింగ్‌డమ్” సినిమాను మే 30న థియేటర్లో విడుదల చేయాలనీ ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు చిత్రబృందం ఈ సినిమాని వాయిదా వేయాలని చూస్తున్నారు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. విజయ్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అతని అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, నాగవంశీ నిర్మిస్తున్నారు.