HomeతెలంగాణRRR:‘అవతార్‌-2’ను కాదని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కు అవార్డు

RRR:‘అవతార్‌-2’ను కాదని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కు అవార్డు

RRR: అంతర్జాతీయ వేడుకలపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చరిత్ర సృష్టించింది. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్‌ అవార్డులను గెలుచుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ తాజాగా మరో అరుదైన అవార్డును గెలుచుకుంది. జపాన్‌ 46వ అకాడమీ అవార్డ్స్‌లో అవుట్‌ స్టాండింగ్‌ ఫారిన్‌ ఫిల్మ్‌ విభాగంలో అవార్డు వరించింది. కాగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘అవతార్‌-2’ను కాదని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అవార్డును సాధించింది. ఇక గతేడాది భారీ ఎత్తున జపాన్‌లో రిలీజైన ఈ సినిమా 24ఏళ్ల ‘ముత్తు’ రికార్డును బ్రేక్‌ చేసి అదరహో అనిపించింది. ఇప్పటి వరకు ఈ సినిమాను జపాన్‌లో 4లక్షల మందికి పైగా వీక్షించారు. జపాన్‌లో అత్యధిక కలెక్షన్‌లు సాధించిన భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది.

ఇటీవలే ఆస్కార్‌ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా భావించే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు ‘నాటు నాటు’ పాటను వరించింది. దీంతో పాటుగా క్రిటిక్‌ ఛాయిస్‌ అవార్డ్స్‌లో భాగంగా బెస్ట్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్, బెస్ట్‌ సాంగ్‌(నాటు నాటు) అవార్డులను కూడా గెలుచుకుంది. ప్రస్తుతం ఆస్కార్‌ నామినేషన్‌ రేసులో ఉంది. మొత్తం పది భారతీయ చిత్రాలు నామినేషన్‌ రేసులో ఉన్నాయి. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ నుండి నాటు నాటు మాత్రం కచ్చితంగా ఆస్కార్‌ గెలుస్తుందని టాలీవుడ్‌ సినీ అభిమానులు ధీమాగా ఉన్నారు. కాగా మంగళవారం రాత్రి 7గంటలకు నామినేషన్స్‌ వెల్లడికానున్నాయి.

Recent

- Advertisment -spot_img