Homeఫ్లాష్ ఫ్లాష్RRR: టార్చర్ పెట్టాను...దర్శక ధీరుడు రాజమౌళి సారీ

RRR: టార్చర్ పెట్టాను…దర్శక ధీరుడు రాజమౌళి సారీ

RRR:టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం (RRR)ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కి నామినేట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా 2023 ఆస్కార్ నామినేషన్ కి సంబంధించి ఈరోజు ఒక లిస్టును విడుదల చేయగా అందులో ఈ పాట స్థానం దక్కించుకోవడం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ పాట ఆస్కార్ నామినేషన్ లో నిలవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రపంచ స్థాయిలో సినిమాలకు మాత్రమే ఆస్కార్ (Oscar) అవార్డు ఇస్తారు. అలాంటిది తెలుగు సినిమా ఆస్కార్ నామినేషన్ కి ఎన్నికవడం అంటే అది మామూలు విషయం కాదు. అయితే ఇప్పుడు నాటు నాటు పాట ఆస్కార్ నామినేట్ కావడంతో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.. నాటు నాటు పాట గురించి రాజమౌళి ప్రస్తావిస్తూ ఇలా ఒక నోట్ విడుదల చేశారు.

ఇప్పుడు ఇంకా నేనేమీ అడగను. నాటు నాటు పాటకు రాంచరణ్, ఎన్టీఆర్ కంటే చాలా ఫాస్ట్ గా నేను డాన్స్ చేస్తున్నాను అని చెప్పారు. ఈ పాటకి సంగీతం సమకూర్చిన కీరవాణి.. పాట రచయిత చంద్రబోస్.. సింగర్స్ కాలభైరవ ..రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ మాస్టర్, కార్తికేయ ఇలా ప్రతి ఒక్కరి గురించి ప్రస్తావిస్తూ ఈయన వారి కష్టానికి తగ్గ ఫలితం అందిందని అందరిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పాటలో ఒక్క స్టెప్పు కూడా సింక్ మిస్ అవ్వకుండా ఎంతో అద్భుతమైన డాన్స్ పర్ఫామెన్స్ చేసినటువంటి ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

ఈ పాట అనేకమంది గుండెల్లో చేరుకోవడం కోసం నేను మిమ్మల్ని చాలా టార్చర్ పెట్టాను. ఇలా టార్చర్ చేసినందుకు సారీ. అయితే ఇంకోసారి ఇలా టార్చర్ చేయాల్సిన పరిస్థితి వస్తే అందుకు తాను ఏ మాత్రం వెనకాడబోనని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఆస్కార్ కోసం నేనెప్పుడూ కలలో కూడా ఊహించలేదు. కానీ అభిమానులే నన్ను ముందుకు నడిపించారు అంటూ అభిమానులకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు రాజమౌళి.

Recent

- Advertisment -spot_img